ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
నవంబరులో ఫెదరర్-సాంప్రాస్‌ల ఎగ్జిబిషన్ మ్యాచ్
మలేషియా రాజధాని కౌలలంపూర్‌లో ఆసక్తికరమైన టెన్నిస్ మ్యాచ్ నవంబరు 22వ తేదీన జరుగనుంది. ప్రస్తుత టెన్నిస్ ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్, టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ నెంబర్‌వన్ ఆటగాడు పీట్ సాంప్రాస్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌ను ఆడనున్నాడు. 12 వేలమంది సీటింగ్ కెపాసిటిగల మలావతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సమవుజ్జీల పోరుగా భావిస్తున్న ఈ పోరుకి టికెట్లును ఈ వారం నుండి విక్రయిస్తారు.

అమెరికాకు చెందిన పీట్ సాంప్రాస్‌కు టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 14 గ్రాండ్‌స్లామ్స్‌ను అందుకున్న రికార్డు ఉంది. సిట్జర్లాండ్ ఆటగాడు ఫెదరర్ ఇప్పటికి 12 గ్రాండ్‌స్లామ్‌లు సొంతంచేసుకుని సాంప్రాస్ రికార్డుకు కేవలం రెండు టైటిల్ల దూరంలో ఉన్నాడు. 2001 వింబుల్డన్‌లో ఫెదరర్, సంప్రాస్‌లు ఓకే ఓకసారి తలపడ్డారు. ఐదు సెట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని
డ్రాగా ముగిసిన ప్రపంచ చెస్ ఛాంపియన్స్
వేదిక మారనున్న పురుషుల ఛాంపియన్స్ హాకీ టోర్నీ
సన్‌ఫీస్ట్‌ టోర్నీ నుంచి తప్పుకున్న సానియా
ఈ నెల 14 నుంచి ఇండియన్ ఆయిల్ గోల్ఫ్ టోర్నమెంట్
సెప్టంబర్ 22 నుంచి చెన్నై గోల్ఫ్ టోర్నమెంట్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో టాప్ సీడ్‌గా ఆనంద్