వచ్చే 2009లో జరుగనున్న ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఆతిథ్య అంశాలపై చైనాలోని యాంగ్యూలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ది ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ (ఏటీటీయూ) టేబుల్ టెన్నిస్ సమాఖ్యలతో చర్చలు జరిపింది.
ఇందులో భాగంగా న్యూఢిల్లీలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌ను జరిపేందుకు ఏటీటీయూ నిర్ణయించిందని ఏటీటీయూ అధ్యక్షుడు లి ఫూరాంగ్ చైనాలోని న్యూస్ ఏజెన్సీకి తెలియజేశారు. ఈ ఆసియన్ ఛాంపియన్‌షిప్స్ 1992న జరిగిన సంగతి తెలిసిందే. కతార్ దేశంలో గత 2004న ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్, 2006 ఏషియన్ గేమ్స్‌ను నిర్వహించింది.
|