ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లు పూర్తి
శ్రీనగర్‌లో జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి జరుగనుంది. 26వ జాతీయ జునియర్ బాయ్స్, తొమ్మిదవ జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటిలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో సుమారు 600 క్రీడాకారులు పాల్గొంటారని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాబు రామ్ పేర్కొన్నారు.

ఈ పోటీలు ఫ్రీ స్టైల్, గ్రెకో-రామన్ స్టైల్ తరహాలో జరుగుతాయని ఆయన తెలిపారు. 400 మంది పురుషులు, 200 మంది మహిళలు పాల్గొంటున్న ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహణా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులు కాశ్మీరీ వ్యాలి అందాలను చూసి ఆస్వాదించాలని బాబు రామ్ తెలిపారు.
మరిన్ని
ఈ నెల 22 నుంచి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ఆధిక్యంలో ఆనంద్
2009 ఆసియన్ టేబుల్ టెన్నిస్‌‌కు భారత్ ఆతిథ్యం
బ్రిటిష్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లోకి గోసల్, భట్టాచార్య
చైనా ఓపెన్: హింగీస్ విజయం
ప్రపంచచెస్ ఛాంపియన్స్: ఐదో రౌండ్లో ఆనంద్ ఆధిక్యం