కోల్‌కతాలో జరుగుతునన్న సన్‌ఫీస్ట్ టెన్నిస్ టోర్నీమెంట్‌లో టాప్ సీడ్ మరియాన్ బర్తోలిపై తొలి రౌండ్లో విజయం సాధించి, సంచలనం సృష్టించిన అమెరికా యువ క్రీడాకారిణి వానియా కింగ్ దూకుడుకు రెండో రౌండ్లో బ్రేక్ పడింది. రెండో రౌండ్లో మరియా కోరిత్సేవా 6-1, 6-2 సెట్లతో వానియా కింగ్‌పై విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
మరో మ్యాచ్‌లో టైటిల్ ఫేవరెట్ స్లోవేకియా భామ డానియేలా హంతుచోవా 6-2, 6-1తో అనస్తాసియా రోడియోనోవాపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌లలో అన్నె కియాతెవాంగ్ 6-3, 6-2తో సునీతారావుపై గెలుపొందింది. డబుల్స్‌లో ఇపెక్ సెనగ్లు, యారాస్లోవా ష్రెడోవా జంట 6-2, 7-6తో శాండీ గుముల్యా- విట్నీ జోన్స్‌లపై విజయం సాధించింది.
|