ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
కంప్యూటర్లకు చెస్ పోటీలు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చెస్ ప్రోగ్రాంలు ఇక మీదట పోటిలలో పాల్గొననున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్న హోటల్ సెన్‌ట్రో హిస్టారికో (మెక్సికో నగరం) ఇందుకు వేదిక కానుంది. ఈ పోటీలు ఈ నెల 27వ తేది వరకు జరుగనున్నాయి.

రిబ్కా వరల్డ్ కంప్యూటర్ చెస్ ఛాంపియన్‌షిప్-2007 అనే పోగ్రాంతోటి జప్పా వరల్డ్ చెస్ ఛాంపియన్-2005, వైస్ ఛాంపియన్ ఇన్ 2007 అనే పోగ్రాంలు ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన చెస్ పోగ్రాంలు బరిలోకి దిగనున్నాయి.

ఈ ఛాంపియన్‌షిప్‌లో కంపూటర్లలో పది గేమ్‌లు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతకు పదివేల డాలర్లు నగదు లభిస్తుంది. ఒక వేళ పోటీలో రెండు కంప్యూటర్లు సమవుజ్జీలుగా నిలిస్తే నగదును సమంగా అందజేస్తారు.
మరిన్ని
సన్‌ఫీస్ట్ టోర్ని: వానియా కింగ్ దూకుడుకు బ్రేక్
జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 22 నుంచి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ఆధిక్యంలో ఆనంద్
2009 ఆసియన్ టేబుల్ టెన్నిస్‌‌కు భారత్ ఆతిథ్యం
బ్రిటిష్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లోకి గోసల్, భట్టాచార్య