ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
ప్రపంచ చెస్‌ ఛాంపిన్‌షిప్: ఆధిక్యంలో ఆనంద్
మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏడవ రౌండ్‌లో రష్యాకి చెందిన అలెగ్జాండర్ గ్రిషుక్‌పై విజయం సాధించి ఆధిక్యంలోకి దుసుకుపోయాడు. తెల్లపావులతో రుయ్‌లోపేజే ఓపినింగ్‌తో ఆటను ప్రారంభించిన ఆనంద్‌ను గ్రిషుక్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

అయితే కీలకమైన చివరి దశలో ఆనంద్ తన ప్రతిభను చూపించి గ్రిషుక్‌పై నెగ్గి ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. గెల్ఫాండ్ 4.5 పాయింట్లతో రెండవ స్థానంతో కొనసాగుతున్నాడు. మాజీ ప్రపంచ క్రామ్నిక్ మూడవ స్థానంలోను, గ్రిషుక్, లెకో, ఆరోనియన్‌లు తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్ ఎనిమిదవ రౌండ్లో ఆనంద్ బోరిస్ గెల్ఫండ్‌తో తలపడనున్నాడు.
మరిన్ని
కంప్యూటర్లకు చెస్ పోటీలు
సన్‌ఫీస్ట్ టోర్ని: వానియా కింగ్ దూకుడుకు బ్రేక్
జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 22 నుంచి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ఆధిక్యంలో ఆనంద్
2009 ఆసియన్ టేబుల్ టెన్నిస్‌‌కు భారత్ ఆతిథ్యం