రానున్న 2011వ ఏడాదిలో జరిగే జాతీయ క్రీడల నిర్వహణ విషయంలో తమ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ తెలిపారు. శుక్రవారం ఉత్తమ క్రీడాకారుకు అందిచే `గినో స్పోర్ట్స్ అవార్డు`ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న జాతీయ క్రీడల నిర్వహణ విషయంలో తమ ప్రభుత్వం ఆర్థిక కారణాల వలన ఈ కార్యక్రమంపై ఒక నిర్ణయానికి రాలేదని ఆయన పేర్కొన్నారు.
క్రీడల నిర్వహణలో ఇతర రాష్ట్రాలతో గోవా పోల్చితే ముందుంటుందని ఆయన చెప్పారు. క్రీడల విషయంలో సమగ్ర విధానాన్ని ఒక నెల రోజుల వ్యవధిలో ప్రవేశపెట్టనున్నట్లు కామత్ తెలిపారు. అనురాగ్ (చదరంగం), నటాషా పల్హా (టెన్సీస్) క్రీడాకరులుగా, నితిన్ వెర్నెకర్ (క్రికెట్), సల్గోకర్ (చదరంగం) ఉత్తమ శిక్షణను అందించినవారుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గోవా క్రీడా విలేకరుల సంఘం, స్పోర్ట్స్ అథారీటి ఆఫ్ గోవా సహకారంతో ఏర్పాటు చేసింది.
|