ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
కొనసాగుతున్న ఆనంద్ ఆధిక్యం
మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆధిక్యం కొనసాగుతుంది. ఆనంద్ ఎనిమిదో రౌండ్‌లో ఇజ్రయేల్‌కు చెందిన బోరీస్ గెల్ఫాండ్‌తో డ్రా చేసుకుని 5.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. నల్లపావులతో గెల్ఫాండ్‌ను ఎదుర్కొన్న ఆనంద్ కేవలం 20 ఎత్తులోలనే ఆటను డ్రాగా ముగించాడు.

గెల్ఫాండ్ ఐదు పాయింట్లతో రెండవ స్థానంతో కొనసాగుతున్నాడు. మాజీ ప్రపంచ క్రామ్నిక్ మూడవ స్థానంలోను, లెకో, గ్రిషుక్ ఆరోనియన్‌లు తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్ తొమ్మిదవ రౌండ్లో ఆనంద్ అమెరికాకు చెందిన ఆరోనియన్‌తో తలపడనున్నాడు.
మరిన్ని
జాతీయ క్రీడలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సిఎం
ప్రపంచ చెస్‌ ఛాంపిన్‌షిప్: ఆధిక్యంలో ఆనంద్
కంప్యూటర్లకు చెస్ పోటీలు
సన్‌ఫీస్ట్ టోర్ని: వానియా కింగ్ దూకుడుకు బ్రేక్
జాతీయ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 22 నుంచి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్