క్రికెటర్లను గౌవరించినట్టుగా తమ రాష్ట్ర క్రీడాకారులను గౌరవించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా.. ఇటీవల హాకీ కప్‌ను కైవసం చేసుకున్న భారత హాకీ జట్టులోని నలుగురు సభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించారు. భారత హాకీ జట్టులో కర్ణాటకు చెందిన విక్రమ్ కాంత్, సునీల్, దిర్కే, రఘునాథ్‌లు ఉన్నారు.
ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు. ట్వంటీ-20 ప్రపంచ క్రికెట్ జట్టులోని కర్ణాటక ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనక వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో హాకీ ఆటగాళ్లకు కూడా ఇవ్వనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
|