ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
జపాన్ టెన్నిస్ టోర్నీ: ప్రి క్వార్టర్స్‌లో సానియా
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా ప్రి క్వార్టర్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన జపాన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్లో సానియా జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి అయుమి మొరితాపై బరిలోకి దిగి గట్టి పోటీతో 6-0, 6-4 తేడాతో విజయాన్ని సాధించింది.


గాయాల కారణంగా మూడు వారాల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా తాజా డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్‌లో ఒక ర్యాంకును కోల్పోయి 29వ స్థానానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ పురుషుల విభాగంలో రోహన్ బోపన్న 252, ప్రకాశ్ అమృత రాజ్ 268వ ర్యాంకుల్లో ఉన్నారు. ఈ టోర్నమెంట్ తర్వాతి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన కాసే డెలకాతో సోనియా తలపడనుంది.
మరిన్ని
విశ్వనాథుడు విశ్వవిజేత
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్: టైటిల్ దిశగా ఆనంద్
హకీ క్రీడాకారులకు నగదు బహుమతి
మోరోజివిచ్‌పై ఆనంద్ అద్భుత విజయం
ఈ నెల 27 నుంచి సబ్ జూనియర్ హాకీ టోర్నీ
ఏ1జిపీ వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న కార్తీకేయన్