అక్టోబర్ 10వ తేదీ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2007 ప్రారంభం కానుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డెహ్రాడూన్‌లో జరిగే ఈ పోటీల్లో 400మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జరిగే ఈ మ్యాచ్‌లు పురుషుల, మహిళల విభాగాల్లో జరుగుతాయని జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ పోటీలు గ్రూప్ -13, 16 విభాగాల్లో జరుగుతాయని ఉత్తరాఖండ్ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ డీఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని పరడే గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన అన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి ప్రకాష్ పాంట్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఆయన వివరాలు అందించారు.
|