ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
మాడ్రిడ్ టెన్నిస్ టోర్నీ: ఫెదరర్‌ ఓటమి
స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఆదివారం ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ రోజర్ ఫెదరర్‌ను డేవిడ్ నల్బాండియన్ ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరిగా సాగిన తుది పోరు నల్బాండిన్ 1-6, 6-3, 6-3 స్కోరుతో స్విస్ ఆటగాడిపై విజయం సాధించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన నల్బాండియన్ పుంజుకుని రెండు, మూడవ సెట్లను నెగ్గి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

సుమారు 18 నెలల విరామం తర్వాత టెన్నిస్ ఆడుతున్న నల్బాండియన్ ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్ ర్యాకింగ్‌లో 25వ స్దానంలో ఉన్నాడు. నల్బాండియన్ చివరిసారిగా మే 2006లో క్లే కోర్టులో టైటిల్‌ను సాధించాడు. వరుసగా టాప్ సీడ్ ఆటగాళ్లను ఈ సీజన్‌లో ఓడించిన రెండవ ఆటగాడు నల్బాండియన్. అంతముందు ఈ రికార్డును నోవాక్ జుకోవిచ్ సాధించాడు.
మరిన్ని
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి పట్టణాభివృద్ధి
మిలటరీ క్రీడల ముగింపుకు రంగం సిద్ధం
రగ్‌బీ వరల్డ్‌కప్‌: దక్షిణాఫ్రికా విజయం
ప్రాబబుల్స్‌గా ఎంపీ హాకీ క్రీడాకారులు
సెమీస్‌కు చేరుకున్న ఫెదరర్
బళ్ళారి ఓపెన్: సెమీస్‌లోకి ఆశుతోష్