ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గౌహతిలో జరుగనున్న ఈ పోటీలకు అస్సాం పోలీసు రైడింగ్ ఆతిథ్యమిస్తోంది. జాతీయ క్రీడలు గత ఫిబ్రవరిలో విజయవంతం కావడంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అస్సాం పోలీసు డైరక్టర్ ఆర్.ఎన్ మాథుర్ విలేకరులతో చెప్పారు.
ఐదురోజుల పాటు జరుగనున్నఈ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 28 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్ వంటి తదితర రాష్ట్రాలు పాల్గొననున్నాయని వివరించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలను గౌహతి రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోజియా ప్రారంభించనున్నారు.
|