డగ్ర్ ఆరోపణలతో రిటైర్మెంట్‌ను ప్రకటించిన ప్రపంచ మాజీ నెంబర్ టెన్నిస్ క్రీడాకారిణి హింగిస్ మాద్రిడ్‌లో జరుగుతున్న సోని ఎర్రిక్సన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యక్షమైంది. రిటైర్మెంట్ ప్రకటించిన ఎనిమిది రోజులకు అనంతరం ఈ టోర్నీని చూసేందుకు మాత్రమే వచ్చానని విలేకరులతో చెప్పింది.
డ్రగ్ వాడానని వచ్చిన ఆరోపణలపై నిర్ధిష్ట అంశాలు ఇంకా తేలలేదని... న్యాయపరమైన కారణాల వల్ల ఇంతకంటే ఏమీ చెప్పలేనని హింగిస్ పేర్కొంది.
చీలమండ గాయంతో గత 2003లో తొలిసారి రైటైరైన హింగిస్ 2006లో తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన హింగిస్ వింబుల్డన్‌లో నిషిద్ధ ఉత్ర్పేరకం "కొకైన్"ను వాడినట్టు పరీక్షలో తేలింది. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ వాడలేదని... తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని హింగిస్ ఇటీవల వెల్లడించిన సంగతి విదితమే.
|