ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
మైక్ టైసన్‌కు మళ్లీ జైలు శిక్ష
ప్రపంచ మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్‌కు మళ్లీ జైలుశిక్ష పడింది. మాదకద్రవ్యం కొకైన్‌ను కలిగి, ఆ కారణంగా కారునడిపినందుకు టైసన్‌కు 24 గంటల పాటు జైలు శిక్ష విధిస్తూ.. అరిజోనాలోనే మెసా కోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆదేశించారు. అంతేకాకుండా.. 360 గంటల పాటు సమాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

నేరాన్ని చేసినట్టు టైసన్ గత సెప్టెంబరు నెలలో అంగీకరించాడు. గతంలో కూడా టైసన్ పలు నేరాలు చేశారని, అందువల్ల ఆయనకు ఏడాది కాలం శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. అయితే.. న్యాయమూర్తి మాత్రం ఒక్క రోజు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. గతంలో టైసన్ నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెల్సిందే.
మరిన్ని
కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలి: అమృతరాజ్
ఒలింపిక్ పోటీల నిర్వహణలో భారత్ బిడ్‌కు మద్దతు
నేటి నుంచి బాస్కెట్ బాల్ ఛాంపియన్ టోర్నీ
డీఎల్‌ఎఫ్ గోల్ఫ్ టోర్నీ కప్ భారత్ వశం
మాస్టర్ కప్ టైటిల్ ఫెదరర్ సొంతం
షాంగై మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోకి రోజర్ ఫెదరర్