ప్రపంచ టెన్నిస్ మాజీ ఛాంపియన్ పీట్ సంప్రాస్ తన ఆరాధ్య దైవమని ప్రస్తుత ఛాంపియన్ రోజర్ ఫెదరర్ అన్నాడు. ఈ ఇద్దరి దిగ్గజాల మధ్య సియోల్‌లో మంగళవారం ఏషియన్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఫెదరర్ పీట్ సంప్రాస్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు. ఈ ఎగ్జిబిషన్‌లో తదుపరి మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇందులో మళ్లీ వీరిద్దరు తలపడనున్నారు.
ఇదిలావుండగా.. మంగళవారం మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ.. సంప్రాస్ నా ఆరాధ్య దైవం. అతనితో కలసి ఆడడం గొప్ప అనుభూతికి లోనైనట్టు చెప్పాడు. అలాగే.. సంప్రాస్ మాట్లాడుతూ.. రోజర్ ఫెదరర్ ప్రపంచంలోనే అత్యుత్తమ అటగాడు. ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చి, మ్యాచ్ ఆద్యంతం ఆస్వాదించాను. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ఐదేళ్ళ క్రితం రిటైర్ అయిన నన్ను ఆహ్వానించినందుకు ఫెదరర్‌కు రుణపడి ఉంటానని సంప్రాస్ అన్నాడు.
|