న్యూయార్క్‌లో జరిగిన డెవిస్ కప్ టోర్నీని అమెరికా కైవసం చేసుకుంది. పాట్రిక్ మెకన్రో సారథ్యంలో అమెరికా జట్టు దాదాపు 12 సంవత్సరాల తర్వాత డేవిస్‌కప్‌ని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రష్యాని ఓడించి టైటిల్‌ని ఎగరేసుకు పోయింది. డబుల్స్‌లో బాబ్, మైక్ బ్రయాన్‌ల జంట 7-6, 6-4, 6-2తో డెవిడెంకో, ఆండ్రీవ్‌ల జంటపై విజయం సాధించి అమెరికాకు 3-0 ఆధిక్యంతో పాటుగా కప్‌ని అందించారు.
అంతకు ముందు జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లలో ఆండీ రాడిక్, బ్లేక్‌లు విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఇప్పటి తమ విజయాన్ని జీవితకాలం గుర్తు పెట్టుకుంటానని మైక్ బ్రయాన్ అన్నారు. అమెరికాకు తిరిగి డేవిస్ కప్‌ని అందించటం చాలా సంతోషంగా ఉందని ఆండీ రాడిక్ హర్షం వ్యక్తం చేశారు.
|