న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న కమన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ కప్ టైటిల్‌ను భారత మహిళల విభాగం గెలుచుకోగా, పురుషుల విభాగంలో భారత్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో భారత మహిళా విభాగం 11 బంగారం, ఐదు వెండి, మూడు కాంస్య పతకాలను సాధించగా, పురుషుల విభాగంలోను దాదాపుగా 11 బంగారం, ఆరు వెండి, మూడు కాంస్య పతకాలు లభించాయి.
ఈ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆతిధ్య దేశమైన న్యూజిలాండ్ మాత్రం పురుషుల విభాగంలో టైటిల్ విజేతగా నిలువగా, మహిళల విభాగంలో రన్నరప్ స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన మాలా శుక్లా 52 కేజీల జూనియర్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు.
కాగా, 2009లో భారత్‌లో ఈ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు కామన్వెల్త్ ఫెడరేషన్ సమాఖ్య ప్రకటించింది.
|