ప్రపంచ విఖ్యాత అమెరికా చెస్ దిగ్గజం బాబీ ఫిషర్ అనారోగ్యంతో మరణించాడు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఫిషర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 1943లో అమెరికాలోని చికాగోలో జన్మించిన ఫిషర్ తన 13వ ఏట యూఎస్ ఓపెన్, 15 ఏళ్ళకు చిరు ఇంటర్నేషనల్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా 1972లో రష్యా ఆధిపత్యానికి గండి కొడుతూ ప్రపంచ ఛాంపియన్ షిఫ్ ఫైనల్లో 11 గేమ్‌ల పోరులో రష్యా గ్రాండ్ మాస్టర్ బోరిన్ స్పాస్కీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
రష్యా ఆధిపత్యానికి బ్రేకులు వేసిన ఫిషర్ ఆకాలంలో ఆమెరికాలో జాతీయ హీరోగా నీరజనాలు అందుకున్నాడు. ఇలా చెస్ క్రీడా చదరంగంలో రారాజుగా వెలుగొందిన ఫిషర్ ఆయన అంతుబట్టిని మనస్తత్వం కారణంగా అట్టడుగు స్థాయికి పడిపోయారు. అంతేకాకుండా.. చదరంగం క్రీడలో విన్నూత్న మార్పులకు ఆనాడే శ్రీకారం చుట్టారు.
|