వచ్చే అక్టోబరులో జరుగనున్న కామన్వెల్త్ యూత్ క్రీడా ఏర్పాట్లను ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం పరిశీలించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన ప్రధాని ఈ మేరకు యూత్ కామన్వెల్త్ ఏర్పాట్లను 20 నిమిషాల పాటు పర్యవేక్షించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 2010లో నిర్వహించనున్న కామన్వెల్త్ క్రీడల నేపధ్యంలో ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం పూణెలో జరుగనున్న యూత్ పోటీలపైనే నిలిచి ఉందని ప్రధాని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది.
కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ప్రధానికి సాదర స్వాగతం పలికి స్టేడియం నిర్మాణ ఏర్పాట్లను వివరించారు. అక్టోబర్‌లో జరుగనున్న ఈ కామన్వెల్త్ యూత్ క్రీడా పోటీల్లో 70 దేశాలు పాల్గొనవచ్చని భావిస్తున్నారు. వచ్చే 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ పోటీలను భారత్ నిర్వహించనుంది.
|