ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమీలియా క్వార్టర్స్‌లో షరపోవా, మౌరెస్మో
అమీలియా ఐలాండ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో రష్యాకు చెందిన ప్రపంచ టాప్ ర్యాంకు అందాల కోవా మరియా షరపోవా, ప్రపంచ మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు చెందిన అమీలీ మౌరెస్మోలు క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనాబెల్ మదీనా గారిగ్యూస్‌పై 7-6 (7/3), 5-7, 7-6 (7/1)తో షరపోవా జయకేతనం ఎగురవేసింది.

అలాగే పోలెండుకు చెందిన ఆగ్నియెస్కా రద్వాన్‌స్కాపై 3-6, 7-5, 7-6తో మౌరెస్మో ఘనవిజయం సాధించింది. కాగా, రష్యాకు చెందిన ఆరో సీడ్ దినారా సఫీనాపై 7-6 (7/5), 0-6, 7-5తో గెలుపొందిన అలోనా బొండారెంకోతో షరపోవా క్వార్టర్స్‌లో తలపడనుంది.

మరోవైపు క్రవోషియన్ క్వాలిఫయర్ కరోలినా స్పెర్మ్‌పై 6-4, 3-6, 6-4తో అమెరికాకు చెందిన లిండాసే డావెన్‌పోర్ట్ విజయం సాధించి ముందడుగు వేసింది. దీంతో ఈ టోర్నీలో డావెన్‌పోర్ట్ మూడు వరుస విజయాలను నమోదు చేసింది. వీరిద్దరి మధ్య మ్యాచ్ 49నిమిషాల పాటు సాగింది.
మరిన్ని
హార్డీ కొత్త ప్రపంచరికార్డుపై కన్ను
బీజింగ్ మహిళా సాకర్‌కు యూఎస్ క్వాలిఫై
ఒలింపిక్ జ్యోతిలో పాల్గొనను: బేడీ
భారీ విజయంతో షరపోవా పునరాగమనం
అమీలియా ఓపెన్‌లో డావెన్‌పోర్ట్ శుభారంభం
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి భారత రెజ్లర్లు