డెవిస్‌కప్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత యువ టెన్నిస్ క్రీడాకారులైన ప్రకాష్ అమ్రిత్‌రాజ్, రోహన్ బోపన్నాలు జయకేతనం ఎగురవేశారు.
గో సోయిడాపై ప్రకాష్ గెలుపొందగా.. ఉజ్బెకిస్తాన్ క్రీడాకారుడు కీ నిషికోరీపై 7-6, 3-6, 6-4, 2-6, 6-3తో బోపన్నా విజయదుందుభి మ్రోగించాడు. నిషికోరి-బోపన్నాల మధ్య మ్యాచ్ అద్యంతం నరాలు తెగే ఉత్కంఠతతో రసవత్తరంగా సాగింది. ఇటీవలే ఫ్రిబవరిలో డెల్‌రే బీచ్ అంతర్జాతీయ ఏటీపీ టోర్నీ ఫైనల్లో నిషికోరీ విజయం సాధించాడు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న డెవిస్‌కప్ టోర్నీలో మాత్రం భారత యువకెరటం బోపన్నా కొన్ని ఎర్రర్‌లను చేసినప్పటికీ.. బలమైన ఏస్‌లను సంధించి విజయతీరాలను చేరుకున్నాడు. మోకాళి గాయం ఇబ్బందిపెడుతున్నా బోపన్నా తనదైన శైలిలో విరుచుకుపడటం గమనార్హం.
|