అమీలియా ఐలాండ్ టెన్నిస్ టోర్నమెంటు మహిళా సింగిల్స్ విభాగంలో రష్యాకు చెందిన మరియా షరపోవా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన అలోనా బొండారెంకోపై 6-7, 6-3, 6-2తో షరపోవా పోరాడి జయకేతనం ఎగురవేసింది.
ప్రపంచ మాజీ ఛాంపియన్ అమెరికాకు చెందిన లిండాసే డావెన్‌పోర్ట్‌తో షరపోవా సెమీస్‌లో తలపడనుంది. క్వార్టర్స్‌లో హంగేరీకి చెందిన ఆగ్నస్ జవాయ్‌పై 6-4, 7-6తో డావెన్‌పోర్ట్ గెలుపొంది సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మ్యాచ్ అనంతరం షరపోవా మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని తను ముందుగానే మానసికంగా సంసిద్ధమై వచ్చానని తెలిపింది.
తొలి సెట్‌లో బొండారెంకో గెలుపొందినప్పటికీ.. రెండో సెట్.. ఆరో గేమ్ నుంచి అనూహ్యంగా పుంజుకోవడం విజయానికి కారణమని షరపోవా తెలిపింది. మరోవైపు టోర్నీ ఆరంభం నుంచి అందరినీ ఆకట్టుకున్న ఫ్రాన్స్‌కు చెందిన అమీలి మౌరెస్మోపై అనూహ్యంగా 6-1, 7-6తో వర్జీనియాకు చెందిన సిబుల్కోవా జయకేతనం ఎగురవేసింది.
|