డెవిస్ కప్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో స్పెయిన్ ఆటగాళ్ల విజయంతో 2-0తో లీడింగ్‌లో కొనసాగుతోంది. స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్.. డేవిడ్ ఫెర్రర్‌లు చెరో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేశారు. జర్మనీకి చెందిన నికోలస్ కీఫర్‌పై 7-6, 6-0, 6-3తో నాదల్ గెలుపొందగా.. జర్మనీ నెంబర్ వన్ క్రీడాకారుడు ఫిలిప్ కొహెల్‌స్క్రీబర్‌పై 6-7, 6-3, 6-4, 6-2తో ఫెర్రర్ విజయదుందుభి మ్రోగించాడు.
ఈ రెండు మ్యాచ్‌లు కీలకమైన క్వార్టర్‌ఫైనల్లో భాగంగా జరిగాయి. జర్మనీ నెంబర్ వన్ క్రీడాకారుడైన ఫిలిప్ 1993లో డెవిస్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో నాదల్ మాట్లాడుతూ ప్రారంభంలో తాను బ్రేక్ పాయింట్ తీసుకోలేకపోవడం ఒకింత బాధకు గురిచేసినప్పటికీ.. చివరికి మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉందన్నాడు.
మరోవైపు అమీలియా ఛాంపియన్‌షిప్ టోర్నీలో రష్యా అందాల భామ మరియా షరపోవా సెమీస్‌లో అమెరికాకు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్ లిండాసే డావెన్‌పోర్ట్‌తో తలపడనుంది. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన అలైజ్ కోర్‌నెట్... అదే దేశానికి చెందిన వర్జీనీ రజ్జానోపై 6-4, 6-2తో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
|