ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డెవిస్ కప్‌: జపాన్‌పై భారత్ గెలుపు
ఆసియా ఓషెనియా క్వాలిఫయింగ్ గ్రూప్‌ పురుషుల డబుల్స్ విభాగంలో జపాన్‌పై గెలుపుతో భారత్.. డెవిస్ కప్ ప్రపంచ గ్రూపులోకి ప్రవేశించింది. భారత్‌కు చెందిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి జోడీ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.

జపాన్‌కు చెందిన ఇవాబుషి మరియు సుజుకి జంటపై 7-6, 3-6, 6-3, 6-4తో భారత జోడీ జయకేతనం ఎగురవేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువకెరటాలు రోహన్ బోపన్నా, ప్రకాష్ అమ్రితరాజ్‌లు వేర్వేరు మ్యాచ్‌లలో జపనీయులపై గెలుపొంది త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

కాగా, పేస్, మహేష్‌లకు ఆదివారం మాస్టర్ సింగిల్స్ క్వాలిఫైయింగ్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లోను వీరిరువురు తప్పనిసరిగా నెగ్గవలసి ఉంది.
మరిన్ని
డెవిస్ కప్: లీడింగ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు
అమీలియా ఓపెన్‌ సెమీస్‌లో షరపోవా
డెవిస్‌కప్‌లో భారత్ పైచేయి
అమీలియా క్వార్టర్స్‌లో షరపోవా, మౌరెస్మో
హార్డీ కొత్త ప్రపంచరికార్డుపై కన్ను
బీజింగ్ మహిళా సాకర్‌కు యూఎస్ క్వాలిఫై