అమీలియా ఐలాండ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టైటిల్ పోరులో రష్యాకు చెందిన అందాలభామ, ప్రపంచ టాప్ ర్యాంకు క్రీడాకారిణి మరియా షరపోవా జయకేతనం ఎగురవేసింది. స్లొవేకియాకు చెందిన దొమినికా సిబుల్కోవాపై 7-6, 6-3తో షరపోవా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
దీంతో ఒకే సీజన్‌లో మూడు టోర్నీ టైటిల్‌లను గెలుచుకున్న తొలి మహిళగా షరపోవా రికార్డు సృష్టించింది. షరపోవా ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా ఓపెన్, ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు-2008 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అయితే ఇదే సీజన్‌లో జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ టెన్నిస్ సెమీఫైనల్స్‌లో స్వెత్లానా కుజ్‌నెత్సోవా చేతిలో షరపోవా పరాభవాన్ని చవిచూసింది. త్వరలో రోలాండ్ గార్రోస్‌లో జరుగనున్న గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ టైటిల్ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు షరపోవా మీడియాతో తెలిపింది.
|