ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన స్టార్ ఆటగాడు జీవ్ మిల్కా సింగ్ ముందంజ వేశాడు. అలాగే భారత టాప్ ర్యాంకు గోల్ఫర్ జ్యోతి రంధ్వా మునుపటి ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. వారం క్రితం జీవ్ 83వ స్థానంలో కొనసాగాడు.
తాజాగా జరిగిన అగస్టా మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంటులో జీవ్ మెరుగ్గా రాణించడంతో మూడు ర్యాంకులు ఎగబాకి 80వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అలాగే రంధ్వా గతంలో 75లో ఉండగా.. తాజాగా తన ప్రతిభతో ఒక్క ర్యాంకు ఎగబాకి 74వ స్థానాన్ని చేరుకున్నాడు.
ఇంకా ఇతర భారతీయ ఆటగాళ్ల వివరాలలోకి వెళ్తే... ఎస్ఎస్‌పీ చౌరాసియా 154వ స్థానాన్ని చేరుకున్నాడు. ఇంకా టాప్-200 ర్యాంకుల్లో ఓర్లాండో ఆధారిత భారతీయ ఆటగాడు అర్జున్ ఆత్వాత్ 198వ ర్యాంకులో ఉన్నాడు. 15వ ర్యాంకులో కొనసాగిన రెండో దక్షిణాఫ్రికా మాస్టర్స్ ఛాంపియన్ అయిన ట్రెవెర్ ఇమ్మెల్మాన్ 14 ర్యాంకులు పైకి ఎగబాకాడు.
|