బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ మాజీ స్ట్రయికర్ రొమారియో తన ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. బ్రెజిల్ జట్టుకు ఒంటి చేత్తో అనేక విజయాలు అందించిన మేటి క్రీడాకారుడు రొమారియో.. ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే తన కెరీర్‌లో వెయ్యికి పైగా గోల్స్ చేసిన ఆటగాడిగా పేరుగడించాడు.
1990 మరియు 1994 ప్రపంచ కప్ పోటీలలో రొమారియో చేసిన ఐదు గోల్స్ బ్రెజిల్ జట్టు విజయతీరాలను చేరుకునేందుకు ఎంతగానో ఉపకరించాయి. 1987 మరియు 2005లలో అతను సుమారుగా 56 గోల్స్ చేశాడు. 42 ఏళ్ల రొమారియో ఇప్పటి వరకు ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో చేసిన గోల్స్ వెయ్యికి పైగా ఉన్నాయి.
మరిన్ని మ్యాచ్‌లలో ఆడేందుకు తాను సుముఖంగా లేనని.. కనుక తాను ఆటకు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు రొమారియో పేర్కొన్నాడు. చివరి 20ఏళ్లు ఎంతో సానుకూలంగా సాగిందని.. వ్యాఖ్యానించాడు. తన ఫిట్‌నెస్‌ను దొరకబుచ్చుకోవడం కష్టసాధ్యమైనదని తెలిపాడు. జట్టుతో తాను ఎంతో సంతోషంగా గడిపానని.. అయితే ఈ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నట్లు వివరించాడు.
కాగా, చివరిసారిగా రొమారియో... నవంబర్ 4న జరిగిన మ్యాచ్‌లో వాస్కోడాగామా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి రెండు కన్నా ఎక్కువ గోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
|