ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చార్లెస్‌టన్‌ టైటిల్‌పై షరపోవా కన్ను
చార్లెస్‌టన్‌ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో విజయపరంపను కొనసాగిస్తానని రష్యా అందాల భామ మరియా షరపోవా వెల్లడించింది. అమీలియా టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో తొలిసారి క్లేకోర్ట్ సీజన్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుని... తాజాగా జరుగనున్న చార్లెస్‌టన్ టైటిల్‌పై షరపోవా కన్నేసింది.

అమీలియా టోర్నీలో స్లొవేకియాకు చెందిన దొమినికా సిబుల్కోవాపై షరపోవా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. మీడియాతో షరపోవా మాట్లాడుతూ క్లేకోర్ట్ సీజన్ టైటిల్‌ను గెలుపొందడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది తన ఆట ఎంతగానో మెరుగుపడిందని సంతృప్తి వ్యక్తం చేసింది.

చార్లెస్‌టన్‌ టోర్నీ రెండో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగనున్న షరపోవా... ఈ టోర్నీ రెండోరౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన వైల్డ్ కార్డ్ బెథానీ మాట్టెక్ లేదా చైనాకు చెందిన మెంగ్ యుఆన్‌తో తలపడుతుంది. కాగా, తొలి రౌండులో టైవాన్‌కు చెందిన చావాంగ్ చియా జుంగ్‌పై 6-2 6-2తో రష్యాకు చెందిన తొమ్మిదో సీడ్ క్రీడాకారిణి వెరా జ్వొనారెవా సునాయాస విజయాన్ని కైవసం చేసుకుంది.

హంగేరీకి చెందిన పదో సీడ్ ఆగ్నస్ జవాయ్ మరియు 12వ సీడ్ స్లొవీనియాకు చెందిన కాథరినా రిబోట్నిక్‌లు ముందంజ వేశారు.
మరిన్ని
రిటైర్మెంట్ ప్రకటించిన రొమారియో
గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో జీవ్ ముందంజ
అమీలియా టైటిల్ షరపోవా కైవసం
డెవిస్ కప్‌: జపాన్‌పై భారత్ గెలుపు
డెవిస్ కప్: లీడింగ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు
అమీలియా ఓపెన్‌ సెమీస్‌లో షరపోవా