ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాకీ : పాకిస్థాన్‌పై భారత్ విజయం  Search similar articles
మలేషియాలో జరుగుతున్న అజ్లాన్ షా హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌కు భారత్ చేరుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి. మ్యాచ్ ఆరంభం నుంచి భారత క్రీడాకారులు వ్యూహాత్మకంగా దాడులు చేశారు.

తొలి అర్ధ భాగంలోనే సందీప్ సింగ్ (6వ ని.), దివాకర్ రామ్ (20వ ని.) లలో గోల్స్‌చేసి భారత జట్టును ఆధిక్యంలో నిలిపారు. మ్యాచ్ మలి అర్ధ భాగంలో పాకిస్థాన్ జట్టు తరపున మహ్మద్ సక్లైన్ 58వ నిమిషంలో గోల్ చేశాడు.

టోర్నీలో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉంది. అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలై అభిమానులను నిరాశపరిచింది. భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్‌ల ద్వారా 9 పాయింట్లు సాధించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేషియాతో భారత జట్టు శనివారం తలపడుతుంది.
మరిన్ని
హాంబర్గ్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో పేస్ జోడీ
హాకీ : భారత-పాకిస్థాన్‌లు సమరానికి సిద్ధం
హాంబర్గ్ టోర్నీ : భూపతి జోడీ పరాజయం
ఆసియన్ టూర్ జాబితాలో భారత గోల్ఫర్లు
గోవాలో విండ్‌సర్ఫింగ్ ఛాంపియన్‌షిప్
సెయిల్ ఓపెన్ : అశుతోష్ సంచలన విజయం