ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాంఛెస్టర్ ఫైనల్లో మన్కడ్ జోడీ పరాజయం  Search similar articles
బ్రిటన్‌లో ప్రధాన నగరాల్లో ఒకటైన మాంఛెస్టర్‌లో ముగిసిన ఎల్టీఏ మాంఛెస్టర్ ట్రోఫీ ఫైనల్లో భారత జోడీ హర్ష్ మన్కడ్-అశుతోష్ సింగ్‌లు పరాజయం పాలయ్యారు. టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియన్ ద్వయం ఆడం ఫీనీ-రాబర్ట్ స్మీట్స్ చేతిలో 3-6, 7-6, 6-10 సెట్ల తేడాతో భారత జోడీ ఓటమి పాలైంది.

నాలుగో సీడ్ క్రీడాకారులు మన్కడ్-అశుతోష్‌లు మ్యాచ్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తొలి సెట్‌లో ఆసీస్ ద్వయం 3-6 తేడాతో విజయం సాధించారు. రెండో సెట్‌లో భారత జోడీ మన్కడ్-అశుతోష్‌లు మెరుగ్గా పోరాడి 7-6 తేడాతో విజయం సాధించారు.

మలి సెట్‌లో భారత జోడీ ఇదే జోరును కొనసాగించలేక 6-10 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ జోడీ 55 ఏటీపీ పాయింట్లు సాధించగా, భారత్ ద్వయం మన్కడ్-అశుతోష్‌లు 38 ఏటీపీ పాయంట్లు సాధించారు.
మరిన్ని
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్‌లో సానియా ముందంజ
2010 కామన్‌వెల్త్ క్రీడలపై భారత్ దృష్టి
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా పతనం
స్టాన్‌ఫోర్డ్‌టోర్నీ టైటిల్ వోజ్నియాక్ కైవసం
'అర్జున అవార్డు'ల కమిటీ ఛైర్మన్‌గా మిల్కాసింగ్
ముందస్తుగానే పనులు పూర్తి : ఢిల్లీ సీఎం