కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న ఏటీపీ రోజర్స్ మాస్టర్స్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి భూపతి జోడి ప్రవేశించింది. అమెరికా ద్వయం మార్డీ ఫిష్-ఆండీ రాడిక్‌లపై మహేష్ భూపతి-మార్క్ నోలెస్‌లు విజయం సాధించి ముందంజ వేశారు. దీనితో భారత-బహామాస్ జోడీ టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
అమెరికా ద్వయంలో మార్డీ ఫిష్ మోకాలి గాయంతో మ్యాచ్ మొదట్లోనే తప్పుకున్నాడు. దీనితో మ్యాచ్ జరగకుండానే భూపతి-నోలెస్‌లు టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధి బరిలోకి దిగకుండానే భారత-బహామాస్ జోడీ ముందంజ వేసింది.
భారత-చెక్ జోడీ లియాండర్ పేస్, లుకాస్‌లతో మహేష్ భూపతి- మార్క్ నోలెస్‌లు క్వార్టర్స్‌లో తలపడే అవకాశాలు ఉన్నాయి. భారత క్రీడకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్‌లు ఇటీవల కాలంలో ప్రత్యర్ధులు తలపడబోవడం ఇదే మొదటిసారి.
|