ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > జాతీయ అథ్లెటిక్ : సంధ్యకు స్వర్ణ పతకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాతీయ అథ్లెటిక్ : సంధ్యకు స్వర్ణ పతకం
కొచ్చిలో జరుగుతోన్న 48వ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 20000 మీటర్ల నడక పోటీలో కేరళకు చెందిన వీఎస్ సంధ్య స్వర్ణం సాధించింది. కొచ్చిలోనీ మహారాజా కళాశాల మైదానంలో జరుగుతోన్న ఈ పోటీల్లో మంగళవారం జరిగిన ఫైనల్ పోటీలో 18ఏళ్ల సంధ్య స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫైనల్స్‌లో సంధ్య 1:51.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఫైనల్స్‌లో మొత్తం ఏడుమంది పాల్గొనగా సంథ్య తర్వాత రైల్వేస్‌కు చెందిన సుప్రియా అడాక్ 1:53.11 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని సాధించింది.

అలాగే రాజస్థాన్‌కు చెందిన కుమారి 2:02.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా కాంస్యాన్ని సాధించింది. ఈ విభాగంలో స్వర్ణాన్ని సాధించిన సంధ్య కేరళలోని పాలక్కడ్‌లో ప్లస్ టూ చదువుతోన్న విద్యార్థి కావడం విశేషం.
మరిన్ని
ఒలింపిక్‌ హాకీలో విఫలం : పీఎస్‌బీ కమిటీ
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ : సానియా ర్యాంక్ పతనం
మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ : సెమీస్‌లో హంపి
యూఎస్ ఓపెన్ టైటిల్‌ విజేత ఫెదరర్
జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ : ప్రీజాకు స్వర్ణం
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఫెదరర్, ముర్రేలు