ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > జాతీయ అథ్లెటిక్స్: జ్యోతికి స్వర్ణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాతీయ అథ్లెటిక్స్: జ్యోతికి స్వర్ణం
జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు తమ బలాన్ని నిరూపించుకున్నారు. కొచ్చిలో జరుగుతున్న ఈ ఛాంపియన్స్‌ చివరిరోజు పోటీల్లో, మహిళల వంద మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి, 200 మీటర్ల రేసులోనూ బంగారం నెగ్గింది.

దీనితో 200 మీటర్లను జ్యోతి 24.22 సెకన్లలో చేరుకుని అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా, సౌజన్య (24.29 సెకన్లు), మృదుల (24.88 సె)లలో చేరుకుని వరుసగా రజతం, కాంస్యం నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు.

ఈ ఛాంపియన్స్‌లో రైల్వేస్ జట్టు మొత్తం 60 (27 స్వర్ణాలు, 19 రజతాలు, 14 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. సర్వీసెస్, కేరళ తర్వాత స్థానాలను దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ 12 ( 2 స్వర్ణాలు, ఐదు రజత, ఐదు కాంస్యాలు) పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది.
మరిన్ని
హార్డిల్స్‌లో కృష్ణ మోహన్ రికార్డు : స్వర్ణం కైవసం
సానియా కాస్త కష్టపడు : కానర్స్ సలహా
జాతీయ అథ్లెటిక్స్ : హర్విందర్ సింగ్‌కు స్వర్ణం
పారాలింపిక్స్ రన్నింగ్ : పిస్టోరియన్‌కు స్వర్ణం
బిపాసా వద్దకు పువ్వులతో వెళ్తా : విజేందర్
జాతీయ అథ్లెటిక్స్ : పరుగులో తిరుగులేని ఏపీ