ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఆసియా సర్క్యూట్ పోటీలకు శ్రీధర్ దూరం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియా సర్క్యూట్ పోటీలకు శ్రీధర్ దూరం
ఆసియా సర్క్యూట్ పోటీలనుంచి తాను తప్పుకుంటున్నట్టు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనూప్ శ్రీధర్ ప్రకటించాడు. గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీధర్ పేర్కొన్నాడు.

ఈ విషయమై శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను మణికట్టు గాయంతో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఈ గాయం కారణంగానే తాను ప్రస్తుత నిర్ణయం తీసుకున్నానని అతను పేర్కొన్నాడు. తాను తీసుకున్న నిర్ణయం తనను చాలా నిరాశకు గురి చేసిందని అయితే నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని అతను తెలిపాడు.

ప్రస్తుతం ఆసియా సర్క్యూట్ పోటీలనుంచి దూరమైనా ఈ నెలాఖరులో జరిగే యూరోపియన్ టోర్నీలపై దృష్టి సారిస్తున్నట్టు శ్రీధర్ పేర్కొన్నాడు. ఆ పోటీల సమయానికి తాను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే నమ్మకం ఉన్నట్టు శ్రీధర్ తెలిపాడు.

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా బీజింగ్‌లో ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న శ్రీధర్ రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
మరిన్ని
గోవా వేదికగా 36వ జాతీయ క్రీడల నిర్వహణ
ఫెడరేషన్ కప్ టెన్నిస్ : రష్యాకే టైటిల్
బీజింగ్ పారాలింపిక్స్ : నథాలీకి ఐదు స్వర్ణాలు
చైనీస్ తైపీ విజేత సైనాకు స్పీకర్ ప్రశంసలు
పీఎస్ఏ టూర్ టైటిల్ సౌరవ్ సొంతం
గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీ : చివరిస్థానంలో ఆనంద్