ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > నంబర్‌వన్ స్థానం సాధిస్తా : ఫెదరర్ విశ్వాసం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నంబర్‌వన్ స్థానం సాధిస్తా : ఫెదరర్ విశ్వాసం
నాలుగేళ్లకు పైగా అట్టిపెట్టుకున్న ప్రపంచ నంబర్‌వన్ స్థానం చేజారినా దాన్ని మళ్లీ తాను సాధించగలనని టెన్నిస్ వీరుడు రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది తాను సాధించాల్సిన లక్ష్యాల్లో టెన్నిస్ అగ్రస్థానం కూడా ఒకటని ఈ సందర్భంగా ఫెదరర్ వ్యాఖ్యానించాడు.

ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు కౌలాలంపూర్‌ వచ్చిన ఫెదరర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఈ సీజన్‌లో తనకు చేదు అనుభవాలు ఎదురైనా వచ్చే ఏడాది తన విజయాల పరంపర కొనసాగించగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. అత్యధికంగా 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి ఆల్‌టైమ్ రికార్డు నెలకోల్పిన అమెరికా క్రీడాకారుడు సంప్రాస్ రికార్డును అధిగమించడం, ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను తిరిగి సాధించడం తన భవిష్యత్ లక్ష్యాలని ఫెదరర్ పేర్కొన్నాడు.

రానున్న ఏడాదిలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి శుభారంభం చేయాలని తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఫెదరర్ పేర్కొన్నాడు. ఇలా లక్ష్యాలను నిర్ధేశించుకున్న తనకు ఇప్పట్లో టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనేదీ లేదని ఫెదరర్ తెలిపాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ముందంజ
పురుషుల టెన్నిస్ ఆసక్తికరంగా ఉంటోంది: మెకెన్రో
గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లో జీవ్
టెన్నిస్ ర్యాంకింగ్స్‌‍లో జంకోవిక్, నాదల్ టాప్
థోర్ప్ రికార్డు బద్దలు కొట్టిన బిడర్‌మేన్
మాస్టర్స్ టెన్నిస్ టైటిల్ జకోవిక్ కైవసం