ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మారడోనాచే ఫుట్‌బాల్ స్కూల్‌కు శంకుస్థాపన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మారడోనాచే ఫుట్‌బాల్ స్కూల్‌కు శంకుస్థాపన
పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని మహెస్థల వద్ద ఫుట్‌బాల్ స్కూల్‌కు అర్జెంటీనా మాజీ సాకర్ దిగ్గజం డియాగో అర్మాండో మారడోనా శంకుస్థాపన చేశారు. మారడోనాను చూడటానికి వేలాది సంఖ్యలో అభిమానులు అక్కడకు రావడం గమనార్హం. బెంగాల్‌లో తనకింతమంది అభిమానులు ఉన్నారన్న సంగతి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందని మారడోనా చెప్పారు. దక్షిణ అమెరికా తర్వాత ఇంతమంది అభిమానులు భారత్‌లో ఉన్నారంటే తనకు పట్టలేని ఆనందాన్ని కలిగించిందన్నారు.

మహెస్థలలోని ఫుట్‌బాల్ స్కూల్‌ను స్థానిక పురపాలక సంస్థ మరియు ఒక ప్రైవేటు కంపెనీ సహకారంతో ఏర్పాటుచేశారు. 1986 ప్రపంచ కప్ సాకర్ కప్‌ను అర్జెంటీనా అందుకునేందుకు మారడోనా విశేష కృషి చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మారడోనాకు కోల్‌కతాలో ఘన స్వాగతం
లండన్ ఒలింపిక్స్ భద్రతకు భారీ కేటాయింపులు?
ప్రపంచ టాప్ టెన్‌లో సైనా నెహ్వాల్
చెన్నైలో ఆసియాన్ జూనియర్ చెస్ టోర్నీ
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ క్రీడలు: సీజీఎఫ్
"ఖేల్‌రత్న కమిటీ"పై మేరీకామ్ పంచ్‌లు..!