ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > 2010 కామన్వెల్త్ గేమ్స్‌కు జరజాగ్రత్త..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
2010 కామన్వెల్త్ గేమ్స్‌కు జరజాగ్రత్త..!
FILE
"2010లో కామన్వెల్త్ గేమ్స్"కు ఆతిథ్యమిస్తోన్న భారత్ జర జాగ్రత్తగా వ్యవహరించాలని ఆస్ట్రేలియన్ స్పోర్ట్ అధికారిక వర్గాలు సూచించాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ వేదిక కానున్న ఈ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆ దేశ ప్రభుత్వం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా క్రీడా శాఖాధికారులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో వచ్చే ఏడాది (2010) అక్టోబర్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న ఈ కామన్వెల్త్ పోటీల్లో, 50 దేశాల తరపున 4వేల అథ్లెట్లు పాల్గొననున్నారని ఆస్ట్రేలియా క్రీడా శాఖ వెల్లడించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ భద్రతా విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని ఆ శాఖ సూచించింది.

గత ఏడాది ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లు, మంగళవారం (మార్చి 3వ తేదీ) శ్రీలంక క్రికెటర్లపై జరిగిన తీవ్రవాదుల కాల్పుల నేపథ్యంలో.. భారత్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా క్రీడా శాఖ వెల్లడించింది.

ఇప్పటికే ఆస్ట్రేలియా అథ్లెట్లు, మాజీ స్విమ్మింగ్ ఛాంపియన్ డాన్ ఫ్లాసెర్లు భద్రతపై యోచిస్తున్నారని క్రీడాశాఖ తెలిపింది. ఈ అంశంపై డాన్ ఫ్లాసెర్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల క్రీడాకారులు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారత్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించాడు. గత 1972లో ఇజ్రాయెల్ అథ్లెట్స్‌పై దాడి జరిగిన సంఘటనను ఫ్లాసెర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

శ్రీలంక క్రికెటర్లపై కాల్పుల నేపథ్యంలో.. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించిన భద్రతపై, ఆస్ట్రేలియన్ కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌లు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్లు ఆస్ట్రేలియా క్రీడాశాఖాధికారులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జియాన్ కప్: వీనస్‌పై సెరీనా గెలుపు
ఆల్ ఇంగ్లాండ్ డబుల్స్: చేతన్ జోడీ ఓటమి
అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు అవసరం: బింద్రా
ఆల్-ఇంగ్లాండ్ టోర్నీలో శ్రీధర్ ముందంజ
వైరస్ ప్రభావం: డేవిస్ కప్‌కు ముర్రే దూరం
ఇటలీ ఛాలెంజర్‌ నుంచి ప్రకాష్ నిష్క్రమణ