ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > కామన్వెల్త్‌లో ప్రసార భారతి పాత్రే కీలకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కామన్వెల్త్‌లో ప్రసార భారతి పాత్రే కీలకం
వచ్చే ఏడాదిలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడా టోర్నీ విజయం సాధించాలంటే అందులో ప్రసార మాధ్యమమైన దూరదర్శన్ (ప్రసార్ భారతి) బాధ్యత ఎంతో కీలకమని జపాన్ విశ్లేషిస్తోంది. ఒకవైపు కామన్వెల్త్ క్రీడలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అంతర్జాతీయ క్రీడ విభాగం కీలకంగా భారత్‌పై దృష్టి సారించింది.

అయితే జపాన్ మాత్రం ఈ క్రీడలను ప్రపంచానికి చూపించడానికి ప్రాతినిద్యం వహించే ప్రసార మాధ్యమాల బాధ్యతే కీలకమని అంటోంది. టోక్యో 2016 ఒలింపిక్ బిడ్ కమిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి యోసుకీ ఫుజివరా విలేకరులతో మాట్లాడుతూ, కామన్వెల్త్ క్రీడలు విజయవంతం కావడానికి ఢిల్లీ వేదిక కానుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 1952 మరియు 1982లలో ఆసియా క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం భారత్‌కు ఉందన్నారు.

అయితే దూరదర్శన్ ఎలా ప్రసారం చేస్తుందనే దానిపైనే కామన్వెల్త్ క్రీడల విజయం ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. ఆసియా బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ నుండి కూడా భారత్‌కు సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రతిష్టాత్మ క్రీడా టోర్నీలు జరగడం సందేహమే..!
గ్రాండ్‌ ప్రిక్స్ చెస్ టోర్నీ: చైనాతో హంపి ఢీ..!
పేస్-భూపతి ముందంజ: 2-1తో భారత్ ఆధిక్యం
ఆనంద్ మ్యాచ్ డ్రా: అగ్రస్థానంలో ఇవాన్చుక్, గ్రిస్చుక్‌
నేటి నుండి జాతీయ రగ్బీ ఛాంపియన్‌షిప్
స్పెయిన్ డెవిస్ కప్ టెన్నిస్ టోర్నీ వాయిదా