ఎనిమిది రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఆసియా కప్ హాకీ ఛాంపియన్‌షిప్ టోర్నీకి ఈనెల 25వ తేదీ భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీ మే తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు జరుగుతుంది.
దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న హరీంద్ర సింగ్ మాట్లాడుతూ.. 24 ప్రాబబుల్స్ సభ్యులతో కూడిన జట్టును ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు చెందిన అడ్‌హాక్ కమిటీ ఎంపిక చేస్తుందని చెప్పారు.
ఈ అడ్‌హాక్ కమిటీలో ఒలింపిక్ మాజీ క్రీడాకారుడు అజిత్‌పాల్ సింగ్, జాఫర్ ఇక్బాల్, ధనరాజ్ పిళ్లై, అశోక్ ధ్యాన్‌చంద్, అస్లామ్ షేర్ ఖాన్‌లు ఉండగా, ఈ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని చెప్పారు. |