ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఏషియాడ్‌కు బిడ్ దాఖలు చేయనున్న భారత్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏషియాడ్‌కు బిడ్ దాఖలు చేయనున్న భారత్
భారత్ 2018 ఆసియా క్రీడలకు బిడ్ దాఖలు చేయనుంది. 2018 ఏషియాడ్ ఆతిథ్యానికి భారత్ గట్టిపోటీ ఇస్తోంది. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ పాహద్ అల్ సాబాహ్ 2007లో ఈ ఏషియాడ్‌ను భారత్‌కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. భారత్ 2014 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సాబాహ్ భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్ సింగ్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో పరిస్థితులు ఇప్పుడు చాలా మారాయి. ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ దక్కాలని షేక్ అహ్మద్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రారంభ ఆసియా క్రీడలకు (1954) భారత్ ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. అనంతరం 1982లో ఏషియాడ్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇచ్చింది. వచ్చే ఏడాది కామన్వెల్త్ క్రీడలకు భారత రాజధాని వేదిక కానుంది. కామన్వెల్త్ క్రీడల కోసం సిద్ధం చేసిన 80 శాతం మౌలిక సదుపాయాలను ఏషియాడ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు.

2018 ఏషియాడ్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశంతోపాటు, 2010 హాకీ ప్రపంచకప్, ఆసియాలో ఒలింపిక్స్ పరిస్థితులపై అహ్మద్, రణ్‌ధీర్ మధ్య చర్చలు జరిగాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చర్చిల్ బ్రదర్స్‌కు ఫిపా చీఫ్ అభినందనలు
ప్రపంచ రికార్డుపై దృష్టి సారించిన వాంజిరు
నేటి నుంచి జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నీ
మోరియాపై గెలుపుతో ఐటీఎఫ్ క్వార్టర్స్‌లోకి భాంబ్రీ
బార్సిలోనా ఓపెన్ టెన్నిస్: డేవిడెంకో ముందంజ
6.2 శాతం పెరిగిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ