స్పెయిన్‌గా చెందిన జోస్ బ్రాసా భారత పురుషుల హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. త్వరలోనే బ్రాసా పురుషుల హాకీ జట్టులో చీఫ్ కోచ్‌గా కలువనున్నట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీర్ కృష్ణా వెల్లడించారు.
భోపాల్‌లో కృష్ణా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు సాగే చీఫ్ కోచ్ పదవికి సంబంధించి భారత ప్రభుత్వం, బ్రాసాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 2011లో జరిగే ఆసియాడ్ టోర్నీ వరకు బ్రాసా పదవిలో కొనసాగుతారని కృష్ణా వివరించారు.
ఈ స్పెయిన్ కోచ్‌కు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందన్నారు. 2012లో జరిగే లండన్ ఒలింపిక్స్ వరకు ఈ పొడిగింపు ఉండవచ్చని కృష్ణా తెలిపారు. హాకీ కోచ్ కానున్న బ్రాసాకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిందని వ్యాఖ్యానించారు.
కామన్వెల్త్ క్రీడలు, ఆసియాడ్ టోర్నీలకు సిద్ధమవ్వడానికి భోపాల్‌లో కనీసం ఒక ఏడాది పాటైనా భారత పురుషుల హాకీ జట్టు క్యాంప్‌ను నిర్వహించనున్నామన్నారు. కాగా, హాకీ జట్టుకు కోచ్‌గా భారత ప్రభుత్వ అభ్యర్థను అంగీకరించడానికి గతంలో బ్రాసా తన డిమాండ్‌లకు సంబంధించి ఒక జాబితాను పంపారు.
ఈ జాబితాలో ప్రధానంగా మంచి ఫిజియోథెరపిస్ట్ కావాలని.. అలాగే ఇద్దరు స్పెయిన్‌కు చెందిన వారితో సహా 14 మంది సిబ్బంది కావాలని కోరినట్లు కృష్ణా తెలిపారు. అంటే 14 మందిలో మిగిలిన సభ్యులను భారత్ నుండే తీసుకోనున్నామన్నారు. |