భారత హాకీ కొచ్‌గా ఎంపికైన జోస్ బ్రాసా.. ప్రపంచకప్ కన్నా.. చైనాలో జరిగే 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడమే ప్రస్తుత లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రపంచకప్ లాంటి భారీ లక్ష్యాల కన్నా.. ముందు త్వరలోనే జరుగనున్న ఆసియా క్రీడలపై తాము దృష్టి పెట్టామన్నారు.వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ వేదిక అయిన నేషనల్ స్టేడియంకు సంబంధించిన ఏర్పాట్లను చూడటానికి.. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రో నీగర్ మరియు ఐఓఏ అధ్యక్షుడు సురేష్ కల్మాడీలతో పాటు బ్రాసా కూడా వచ్చారు. ఈ సందర్భంగా బ్రాసా విలేకరులతో మాట్లాడారు.అతి కొద్ది నెలల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని తాము చెప్పలేమని.. అయితే ప్రపంచకప్ మాత్రం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అన్నింటికంటే ముందుగా తాము ఆసియా కప్‌లో జట్టు రాణించడంపై ప్రణాళిక చేస్తామన్నారు.ఆసియా క్రీడలను వచ్చే ఒలింపిక్స్ క్రీడల క్వాలిఫికేషన్ టోర్నీగా ఎంతో కీలకమైనదని వ్యాఖ్యానించారు. కాగా, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ క్రీడల్లో స్పానిష్ మహిళ జట్టు పసిడి పతకాన్ని సాధించడానికి బ్రాసా సూచనలు ఎంతగానో ఉపకరించాయి. |