ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం
Dinara safina
FileFILE
అనూహ్యంగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును చేరుకున్న రష్యా భామ దినారా సఫీనా.. ఎట్టకేలకు ఆ స్థానానికి తాను అర్హురాలినేనని మాడ్రిడ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌ను గెలుపొంది మరోసారి నిరూపించింది. ఈ టోర్నీ మహిళల విభాగంలో ఆదివారం జరిగిన రసవత్తరమైన ఫైనల్ పోరులో నెగ్గి సగర్వంగా టైటిల్‌ను చేజిక్కించుకుని విమర్శల నోళ్లకు కళ్లం వేయగలిగింది.

అతి తక్కువ సమయంలో మూడు టోర్నీల్లో పాల్గొన్న సఫీనా ప్రతి టోర్నీకి రాటుదేలుతూ వచ్చింది. స్ట్రట్‌గార్ట్ టెన్నిస్ టోర్నీలో మరో రష్యా తార స్వెత్లానా కుజ్‌నెత్సోవా చేతిలో కంగుతిన్న సఫీనా.. రోమ్ ఓపెన్ టెన్నిస్‌లో మాత్రం విజయంతో అందరినీ అకట్టుకుంది.

రోమ్, మాడ్రిడ్‌ ఓపెన్‌లలో సఫీనా బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంది.. మట్టికరిపించింది. తన స్థానానికి వన్నె తీసుకువచ్చింది. అదలా ఉంచితే మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో డానిష్ టీనేజర్ అయిన కరోలిన్ వోజ్‌నియాకీపై 6-2, 6-4తో సఫీనా గెలుపొందింది.

మ్యాచ్ అనంతరం సఫీనా విలేకరులతో మాట్లాడుతూ, మ్యాచ్ అఖరులో కొంత వరకు అలసిపోయానని.. అయితే కీలక సమయాల్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం వహించగలిగానని పేర్కొంది. కాగా, మాడ్రిడ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కరోలిన్ ఇప్పటి వరకు నాలుగు టోర్నీల్లో ఫైనల్స్ వరకు వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్నదైన ఫ్లోరిడా టైటిల్‌ను నెగ్గింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఈపీఎల్ టైటిల్‌ సొంతం చేసుకున్న మాంచెస్టర్
ఇజ్మీర్ కప్: రన్నరప్‌గా నిలిచిన ప్రకాష్ జంట
యూరోపియన్ గ్రాండ్ ప్రి: భారత్‌కు రెండు కాంస్య పతకాలు
మాడ్రిస్ టెన్నిస్ సెమీస్‌లో సఫీనా, మౌరెస్మో
ఏఎఫ్‌సీ కప్‌: ఇరాన్‌కు బయలుదేరిన భారత్ జట్టు
మాడ్రిడ్‌లో నాదల్, ఫెదరర్, జకోవిక్‌ల ముందంజ