ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మెయిన్ డ్రాకు అర్హత పొందిన అనుశ్రీ, ప్రేరణా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెయిన్ డ్రాకు అర్హత పొందిన అనుశ్రీ, ప్రేరణా
ముంబైలో జరుగుతున్న ఐటీఎఫ్ ఫ్యూచర్స్ మహిళల టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన అనుశ్రీ తమన్నా.. ముంబై భామ సాగరికా ఫాడ్కేపై గెలుపొంది మెయిన్ డ్రాకు క్వాలిఫై అయింది. రెండో రౌండులో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సాగరికపై 6-2, 2-6, 6-2తో అనుశ్రీ అనూహ్య విజయాన్ని అందుకుంది.

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ అయిన ఈ టోర్నీ ముంబైలోని శివాజీ పార్క్ జిమ్కానా హార్డ్ కోర్డులలో జరిగింది. ఈ టోర్నీ తొలి రౌండులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తన్వీ షాహ్‌తో తలపడిన అనుశ్రీ గెలుపొంది.. రెండో రౌండుకు చేరుకుంది.

అదలా ఉంచితే మరో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ భామ ప్రేరణా బాంబ్రీ కర్ణాటకకు చెందిన ఆశా నందకుమార్‌పై 4-6, 6-3, 6-4తో గెలుపొందింది. ప్రారంభరౌండులో క్వాలిఫైయర్ అయిన ఐశ్వర్య శ్రీవాత్సవ పై ప్రేరణా గెలుపొందింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం
ఈపీఎల్ టైటిల్‌ సొంతం చేసుకున్న మాంచెస్టర్
ఇజ్మీర్ కప్: రన్నరప్‌గా నిలిచిన ప్రకాష్ జంట
యూరోపియన్ గ్రాండ్ ప్రి: భారత్‌కు రెండు కాంస్య పతకాలు
మాడ్రిస్ టెన్నిస్ సెమీస్‌లో సఫీనా, మౌరెస్మో
ఏఎఫ్‌సీ కప్‌: ఇరాన్‌కు బయలుదేరిన భారత్ జట్టు