ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > జాతీయ జట్టులో ఎంపీ అకాడెమీ షూటర్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాతీయ జట్టులో ఎంపీ అకాడెమీ షూటర్లు
Shooting
FileFILE
జూన్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న షూటింగ్ హోప్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ అకాడెమీకి చెందిన 6మంది షూటర్లు ఎంపికయ్యారు. ఈ టోర్నీ జెక్ రిపబ్లిక్‌లో జూన్ 3నుండి 7వ తేదీ వరకు జరుగనుంది.

ఇటీవలే ఈ జట్టును పూనేలో ఎంపిక చేశారు. జట్టులోకి ఎంపికైన 6గురు సభ్యుల్లో నవదీప్ సింగ్, పార్థ అగర్వాల్, సురభి పథక్, హర్షవిన్ చావ్లా, రచనా శర్మా, శివంగి జలానీలు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ భారత్ నుండి మొత్తం 30 మంది అభ్యర్థులు వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నారు.

మధ్యప్రదేశ్ క్రీడలు మరియు యువ సంక్షేమశాఖ డైరెక్టర్ సంజయ్ ఛౌదరి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం టోర్నీకి వెళ్లే 30 మంది పోటీదారులకు పూనేలో ట్రైనింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు వెళ్తున్న వారిలో సింగ్, పథక్‌లను షెడ్యూల్ ప్రకారం సింగపూర్‌లో జూల్ 30 నుండి 4వరకు జరుగనున్న తొలి ఆసియా యూత్ క్రీడలకు కూడా ఎంపిక చేశామన్నారు.

సింగ్ పురుషుల జూనియర్ ఎయిర్ రైఫిల్‌లో.. మహిళల విభాగంలో జూనియర్ ఎయిర్ పిస్తోల్‌లో పథక్‌లు పాల్గొననున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు చాలా క్లిష్టమైన పోటీని ఎదుర్కోనున్నట్లు ఎంపీ అకాడెమీ కోచ్ వేదప్రకాశ్ పిలానియా వెల్లడించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మాజీ హాకీ ఆటగాడు అల్ఫాన్సో మృతి
నాదల్‌కు షాక్: టైటిల్ చేజిక్కించుకున్న ఫెదరర్
మెయిన్ డ్రాకు అర్హత పొందిన అనుశ్రీ, ప్రేరణా
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం
ఈపీఎల్ టైటిల్‌ సొంతం చేసుకున్న మాంచెస్టర్
ఇజ్మీర్ కప్: రన్నరప్‌గా నిలిచిన ప్రకాష్ జంట