సీజన్ ఆఖరులో జరిగే ఏఎఫ్‌సీ కప్‌లో మోహున్ బగన్ జట్టు కెప్టెన్‌గా భైచుంగ్ భూటియా పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిరియా జట్టు అయిన ఏఐ కరమాహ్‌తో భరత జట్టు అయిన మోహున్ బగన్ ఈ ఏఎఫ్‌సీ కప్‌లో భాగంగా తలపడాల్సి ఉంది.అయితే ఈలోపు మే 14న భారత ప్రధాన స్ట్రైకర్ అయిన భైచుంగ్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. అనేక ట్రైనింగ్ సెషన్‌లలో పాల్గొనకపోవడం.. ఎలాంటి సమాచారం లేకుండానే జల్పాయ్‌గురిలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు గైర్హాజరీ కావడంపై వివరణ ఇవ్వాలని మోహున్ బగన్ క్లబ్ అడిగింది.దీనికి సంబంధించి క్లబ్ జనరల్ కార్యదర్శి అంజన్ మిత్రా.. భైచుంగ్‌కు ఘాటైన ఇమెయిల్ పంపారు. భైచుంగ్‌ను కెప్టెన్‌గా కాకుండా.. రిజిష్టర్ అయిన ఆటగాడిగా ఈ ఇమెయిల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేనిచో.. జట్టులో స్థానంలో ఉండదని హెచ్చరించారు. |