ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మోహన్ బగన్ క్లబ్‌కు భూటియా గుడ్‌బై!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మోహన్ బగన్ క్లబ్‌కు భూటియా గుడ్‌బై!
FILE
మోహన్ బగన్ క్లబ్‌తో తన సంబంధాలు తెంచుకోవాలని బైచుంగ్ భూటియా నిర్ణయించుకున్నాడు. జాల్‌పాయ్‌‍గురిలో ఇటీవల జరిగిన క్లబ్ ప్రాక్టీసు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు దూరమైనందుకు క్లబ్ బైచుంగ్ భూటియాకు షోకాజు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్లబ్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు భూటియా సోమవారం వెల్లడించాడు.

ఇకపై మోహన్ బగన్ తరపున ఆడాలనుకోవడం లేదని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ చెప్పాడు. ఓ రియాల్టీ షోలో పాల్గొని గత రాత్రి భూటియా ఇక్కడకు వచ్చాడు. తనకు పంపిన షోకాజు నోటీసు ప్రచారం కోసం వేసిన ఎత్తుగడ అని తెలిపాడు. ఈ వ్యవహారాన్ని సరిగా నడిపించి ఉండాల్సిందన్నాడు.

క్లబ్ ప్రధాన కార్యదర్శి అంజన్ మిశ్రా తనకు ఫోన్ చేసినా సరిపోయేదని ఈ సీజన్‌లో మోహన్ బగన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భూటియా పేర్కొన్నాడు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అయితే తనకు అది ఇష్టం లేదని చెప్పాడు. సంబంధాలు తెంచుకోవడం ఇద్దరికీ మంచిదన్నాడు. ప్రస్తుతానికి మోహన్ బగన్ తరపున ఆడాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏఎఫ్‌సీ కప్: భైచుంగ్ పాల్గొనడంపై అనుమానాలు
జాతీయ జట్టులో ఎంపీ అకాడెమీ షూటర్లు
మాజీ హాకీ ఆటగాడు అల్ఫాన్సో మృతి
నాదల్‌కు షాక్: టైటిల్ చేజిక్కించుకున్న ఫెదరర్
మెయిన్ డ్రాకు అర్హత పొందిన అనుశ్రీ, ప్రేరణా
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం