బెంగుళూరులో మే 31 నుండి ప్రారంభం కానున్న సన్‌ఫీస్ట్ వరల్డ్ 10కే రన్‌లో పాల్గొనడానికి 200 మంది అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు రానున్నారు. సుమారు 155,000 డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో కెన్యాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేస్ మొమాన్యీ కూడా పాల్గొంటున్నాడు.
ఈ రెండో ఎడిషన్ కోసం భారత్ మరియు విదేశాల నుండి సుమారు 15వేల ఎంట్రీలు ఇప్పటికే స్వీకరించబడ్డాయి. ఇది త్వరలో 25వేలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. గత ఏడాది తొల ఎడిషన్‌లో సుమారు 18వేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ విషయలను టోర్నీ ప్రొమోటర్లయిన వివేక్ సింగ్ ఆఫ్ ప్రొకామ్ ఇంటర్నేషనల్ విలేకరులకు వెల్లడించింది.
ట్రాక్, ఫీల్డ్, లాంగ్ డిస్టెన్స్, రోడ్ రన్నింగ్ విభాగాల్లో ప్రపంచంలోని ప్రధాన అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో రువాండాకు చెందిన డియుడొన్నే డిసీ, ఉగాండాకు చెందిన బోనిఫేస్ కిప్రోప్, టాంజానియాకు చెందిన ఫాబియానో జోసెఫ్, కెన్యాకు చెందిన విల్సన్ కిప్సాంగ్‌లు ఉన్నారు. |