అంతర్జాతీయ హాకీ నిబంధనలను తమకు అనూకూలంగా భారత్ వినియోగించుకోవలసి ఉందని భారత హాకీ జట్టు కోచ్‌గా ఎంపికైన జోస్ బ్రాసా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో నైపుణ్యానికి ఎలాంటి కొదవా లేదని... కాకపోతే.. కొత్త అంతర్జాతీయ నిబంధనల నుండి లబ్ధి పొందడంలో విఫలమైందన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ)చే జాతీయ జూనియర్ మరియు సీనియర్ హాకీ జట్లు అందించే శిక్షణ మౌలికసదుపాయాలకు సంబంధించిన స్టాకును తీసుకెళ్లడానికి బ్రాసా గుర్గావ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)చే మార్పు చేయబడిన కొత్త క్రీడా నిబంధనలను ఉపయోగించుకోవడంలో భారత జట్టు విఫలమైందని తెలిపారు. అందుకోమే... ఆటగాళ్లకు అందించాల్సిన సౌకర్యాలు, మౌలికసదుపాయాల జాబితాను ఇప్పటికే ఎస్ఏఐకు అందజేయనున్నామన్నారు. అంతకంటే.. ముందుగా దీనికి సంబంధించి తాను అధ్యయనం చేయవలసి ఉందన్నారు. |